ETV Bharat / state

"15రోజుల్లో ఛార్జిషీట్​ వేస్తాం"

జయరాం  హత్యకేసులో నిందితుల డొంక కదులుతోంది. దర్యాప్తు జరిపేకొద్దీ..పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్​, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. 15 రోజుల్లో ఛార్జ్​ షీట్ దాఖలు చేయనున్నారు.

జయరాం  హత్యకేసులో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
author img

By

Published : Mar 14, 2019, 6:09 PM IST

Updated : Mar 15, 2019, 1:02 AM IST

జయరాం హత్యకేసులో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
జయరాం హత్య కేసుకు సంబంధించి పోలీసుల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. రాకేశ్​రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, హత్యకేసులో వారి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఈ కేసులో సహాయ నటుడు సూర్య, అతని మిత్రుడు కిశోర్​, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

వెలుగులోకి వస్తున్న అక్రమాలు

డిసెంబర్​ 2017లో ప్రగతి రిసార్ట్స్​ ఎండీ కుటుంబాన్ని భయపెట్టి, కొంత భూమిని రాయించుకున్నట్లుడీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దవాళ్లతో సంబంధాలు ఉన్నాయనే భయంతో వారు రాకేశ్ ​రెడ్డిపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ భూమిని భూదేవి అనే పేరు మీద రిజిస్టర్​ చేయించినట్లు పేర్కొన్నారు.దానిలో కొంత భాగాన్ని అంజిరెడ్డికి విక్రయించాలనుకున్నాడని అన్నారు. ఆ పత్రాలు అంజిరెడ్డి వద్దే ఉన్నాయని డీసీపీ తెలిపారు.

ఇవీ చూడండి:రాకేశ్​రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా

Last Updated : Mar 15, 2019, 1:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.