రామాయణంలో లక్ష్మణరేఖ లాగా... ప్రస్తుతం ప్రజలు సైతం ఇల్లు అనే లక్ష్మణరేఖ నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీరాముడు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో... పౌరులు సైతం అలానే క్రమశిక్షణతో ఉంటూ... ప్రస్తుత పరిస్థితికి సహకరించాలని కోరారు. అంతా ఇంటి నుంచే పూజలు చేసినందుకు ఆ దేవుని దయతో త్వరగా మామూలు పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని... వారిని గౌరవించాలని సూచించారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు