కడప పట్టణంలోని ఊరగాయల వీధికి చెందిన రాము ఓ చిరు వ్యాపారి. అయితేనేం...పర్యావరణ పరిరక్షణకు తనవంతు సహాయ సహకారాలు అందించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత తొమ్మిదేళ్లుగా పర్యావరణానికి హాని చేయని విధంగా విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి పూజిస్తున్నారు. గతంలో దూది, సిమ్‌కార్డు, బూంది తదితర వాటితో విగ్రహాలను ఏర్పాటు చేసి గుర్తింపు చాటుకున్నారు. ఈసారి పూర్తిగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటిని ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ గణనాథుని తయారీకి 40 వేలు ఖర్చు కాగా.. నాలుగు నెలల సమయం పట్టిందని రాము తెలిపారు. కాలుష్య నివారణ కోసమే ఈ తరహా విగ్రహాలను తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :నవధాన్యాలతో ఆకృతి దాల్చిన ఆదిత్య గణపతి