వింగ్స్ ఇండియా 2020 అంతర్జాతీయ ఏవియేషన్ ప్రదర్శన బేగంపేట విమానాశ్రయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. కార్యక్రమంలో భాగంగా పలు కంపెనీలకు చెందిన ఎవియేషన్ ప్రణాళికలు బిజినెస్‌కు సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి.
ప్రదర్శనకు కరోనా దెబ్బ
గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రదర్శనకు సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావంతో విదేశీ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలు ఎయిర్ షో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఎయిర్ షో మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా పలు విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!