ప్రతి రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ సంయుక్తంగా వింగ్స్ ఇండియాను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈసారి నాలుగు రోజులపాటు కొనసాగిన ఏవియేషన్ షో ఆదివారంతో ముగిసింది. కరోనా వైరస్ ప్రభావంతో అతికొద్ది మంది వీక్షకులను పరిమిత సమయంలోనే అనుమతించారు. ఇది కొంచెం వీక్షకులను నిరుత్సాహపరిచింది. స్టాళ్లు ఏవియేషన్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, వాటి విడిభాగాల ప్రదర్శనలు ఆకట్టున్నాయి.
ఆకట్టుకున్న విన్యాసాలు
మొదటి మూడు రోజులు హోండా ఎన్271బీబీ, ధ్రువ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ హెలికాప్టర్, డీఓ–228, ప్రాఫిట్ హంటర్, ఎయిర్ ఇండియా, జీబీఎల్ హెలికాప్టర్, ప్రాఫిట్ హంటర్ ఈ195–ఈ2 హెలికాప్టర్లు, హోండాజెట్, స్పైస్ జెట్‌లను ప్రదర్శనలో ఉంచారు. చివరి రోజు ఐదు చాపర్లు, విమానాలను మాత్రమే అందుబాటులో ఉంచారు. మూడవ రోజు విస్తారా విమానం ఆకట్టుకుంది. గత ఏవియేషన్‌తో పోల్చితే ఈసారి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తమ ఉత్పత్తులను ప్రదర్శించిన కంపెనీలు
ఏవియేషన్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎక్కువ శాతం విమాన ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంజిన్ ఉత్పత్తుల నుంచి ప్రయాణికులు దిగేందుకు ఉపయోగించే మూవింగ్ స్టెప్స్ వెహికల్ వంటి ఉత్పత్తుల తయారీ సంస్థలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. జెట్ ఎయిర్‌వేస్, కార్పొరేట్స్ జెట్స్ వంటి స్టాళ్ల ద్వారా విమానాలు, హెలికాప్టర్ మోడళ్లపై ప్రచారం కల్పించారు. పలు రకాల ఉత్పత్తులను విమానాలను చూసిన వీక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: త్వరలో మిషన్ హైదరాబాద్ : కేటీఆర్