ETV Bharat / state

'సనత్‌నగర్‌ హిందూ శ్మశాన వాటిక కబ్జా చేస్తారా ?'

హైదరాబాద్​లోని సనత్​నగర్ హిందూ శ్మశనా వాటికను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండతో కొంత మంది కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సీపీని కలిసి బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : మర్రి శశిధర్ రెడ్డి

author img

By

Published : Nov 26, 2019, 6:03 AM IST

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని హిందూ శ్మశాన వాటికను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే వాటిని అడ్డుకోవాలని మర్రి శశిధర్‌ రెడ్డి నగర సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కబ్జాకు యత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తలసాని మంత్రి కావడం వల్ల స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు రోజుల కిందట మంత్రి తలసాని శ్మశాన వాటిక కమిటీని పిలిపించి స్థానిక కార్పొరేటర్‌ శేషు కుమారితో కలిసి దూషించారని తెలిపారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన మర్రి... తమ ఫిర్యాదును స్థానిక డీసీపీకి పంపించాలని కోరారు. స్పందించిన సీపీ రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీసీపీని ఆదేశించినట్లు కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : మర్రి శశిధర్ రెడ్డి

ఇవీ చూడండి : 'ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.