తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయని గచ్చిబౌలి తెరాస అభ్యర్థి సాయిబాబా ధీమావ్యక్తం చేశారు. గత ఐదేళ్ల కాలంగా డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టామని, మిషన్ భగీరథతో నీటి సమస్య తీర్చామన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే.. పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు.. బంగారు గచ్చిబౌలి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'