హన్మకొండ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరమని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:సంపులో పడి బాలుడు మృతి