గొంతులో ప్రాణమున్నంత వరకు ప్రధాని మోదీని విమర్శిస్తూనే ఉంటానని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఎంఐఎం ముస్లింల పార్టీ కాదని... అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో జరిగిన పుర ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఓవైసీ ఎంఐఎం పార్టీకే ఓటేయాలని కోరారు.
పుర ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను భారీ ఆధిక్యతతో గెలిపించి... పతంగుల పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సభలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్ హాజరయ్యారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఇవీ చూడండి : బస్తీమే సవాల్: దుండిగల్లో దండిగా ఓట్లు పడేది ఏ పార్టీకి...?