ETV Bharat / state

బలవంతంగా పుట్టింటికి పంపారు... ఆ తర్వాత ఏమైందంటే? - ముషీరాబాద్​లో భర్త ఇంటి వద్ద భార్య ఆందోళన

కరోనా సమయంలో పిల్లలు బయట తిరగకూడదు.. మన బంధువుల ఫంక్షన్​ ఉంది.. నేనూ మీ ఆయన వెళ్తాం.. ఒక నాలుగు రోజులు నువ్వు మీ పుట్టింటికి వెళ్లమని చెప్పింది అత్త. నమ్మేసిన కోడలు సరేనని వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

wife-protest-at-husband-house-in-musheerabad-hyderabad
బలవంతంగా పుట్టింటికి పంపారు... ఆ తర్వాత ఏమైందంటే?
author img

By

Published : Jun 17, 2020, 1:49 PM IST

పుట్టింటికి వెళ్లి... తన మెట్టినింటికి వచ్చిన వివాహిత షాక్​ గురైంది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ముషీరాబాద్​కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్​లకు ఏడు సంవత్సరాల కుమార్తె ఉంది.

అసలేం జరిగిందంటే..?

లాక్​డౌన్​కు నాలుగురోజుల ముందు బాధిత మహిళ అత్తయ్య బంధువుల ఫంక్షన్​ ఉందని... బలవంతంగా తనని పుట్టింటికి పంపించారని వాపోయింది. తిరిగి ఉగాది పండగ ముందురోజు ఇంటికి వచ్చి చూస్తే... తాళం వేసి ఉందని... అప్పటి నుంచి తన భర్త, అత్తయ్య ఫోన్​ కూడా లిఫ్ట్​ చేయట్లేదని ఆవేదన చెందింది. అదేరోజు నారాయణగూడ పోలీసులకు చెబితే.. బలవంతంగా మళ్లీ ముషీరాబాద్​లోని పుట్టింటికి పంపించేశారని.. తనకు న్యాయం చేయాలని కోరింది. ఎలాగైనా తన అత్తయ్యను, భర్తను వెతికి పెట్టాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.