ETV Bharat / state

Wife Kills Husband With Her Boyfriend : మన బంధానికి మా ఆయనే అడ్డు.. అతన్ని చంపేసెయ్! - ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

Wife Kills Husband With Her Boyfriend : వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న వాడిని సైతం వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారు కొందరు మహిళలు. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధి పాలు చేస్తున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్య.. తమ బంధానికి కట్టుకున్నవాడు అడ్డొస్తున్నాడని ప్లాన్​ చేసి మరీ చంపించింది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

crime news
Wife Kills Husband With Her Boyfriend
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 1:28 PM IST

Wife Kills Husband With Her Boyfriend : వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు కొందరు మహిళలు. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధి పాలు చేస్తున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలడానికి పతకం వేసి మరి భర్తను హత్య చేయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన రాములు-కేశమ్మ దంపతులు. రాములు వృత్తిరీత్యా లారీ డ్రైవర్​గా పని చేస్తూ హైదరాబాద్​ అల్మాస్ గూడలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. దూరపు బంధువైన మన్చర్ల రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి రాములు, తన భార్య కేశమ్మను పలుమార్లు మందలించాడు. దీంతో ఆమె భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్​ చేసింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం భర్తతో గొడవ పెట్టుకొని పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. ఆపై పథకం ప్రకారం విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములుపై రాము దాడికి దిగి హత్య చేసి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితుడు మన్చర్ల రాము, అతనికి సహాయం చేసిన రవి, భార్య కేశమ్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి తెలిపారు.

A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

Wife Kills Husband Along With Boyfriend : మరో ఘటనలో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన ఇల్లాలు.. కట్టుకథతో పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. చివరకు కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళితే.. ఆ దంపతులు జీవనోపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్​కు వచ్చారు. ఈ క్రమంలో భర్త స్నేహితుడికి ఆమె దగ్గరై ఆ కుటుంబం ఛిద్రం కావడానికి కారణమైంది. దీంతో భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్య జైలు పాలైంది. పిల్లలు తల్లిదండ్రుల అండ లేనివారుగా అయ్యారు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ భూక్యా మహేశ్‌కు అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో కొన్నాళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే మహేశ్‌కు రెండుసార్లు పక్షవాతం వచ్చింది.

స్నేహితుడని నమ్మి ఇంటికి తెస్తే.. చివరికి! మహేశ్​ దంపతులు 6 నెలల కిందట కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌ పరిధి రామ్‌నరేశ్‌ నగర్‌కి వచ్చారు. విక్రమ్‌ అనే మరో క్యాబ్‌ డ్రైవర్‌ని నమ్మి మహేశ్‌ రెండుసార్లు ఇంటికి తీసుకురాగా.. అతను మహేశ్​ భార్య లతకు దగ్గరయ్యాడు. చివరకు ఆ బంధం మహేశ్‌ను హతమార్చే వరకు వెళ్లింది. భర్త మహేశ్‌ను కుర్చీలో కూర్చోబెట్టి ఉరి పెట్టారు. తర్వాత ఆయన మూర్ఛతో మృతి చెందినట్లు భార్య చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఇంటి యజమాని దగ్గర​లోని వైద్యుడిని పిలిపించారు. అప్పటికి ఇంకా మహేశ్‌ నాడి కొట్టుకుంటూ ఉండడంతో.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేశ్‌ మృతి చెందగా.. శవ పరీక్షలో మహేశ్‌ది సహజ మరణం కాదని, ఉరివేసి చంపినట్లు నమోదైంది. దీంతో పోలీసులు లత(23)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ బయటకొచ్చింది. ప్రస్తుతం విక్రమ్​ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Husband Killed His Wife Riding Scooty : స్కూటీపై వెళుతున్న భార్య.. అడ్డగించిన భర్త.. చివరకు ఏమైందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.