ETV Bharat / state

గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత..? - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అధికార తెరాస, భాజపా, మజ్లిస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతల ప్రసంగాలు కీలక భూమిక పోషించాయి. అంతే స్థాయిలో ఆయా పార్టీల సామాజిక మాధ్యమ వేదికలు అత్యంత కీలకంగా నిలిచాయి. తెరాస, భాజపా, మజ్లిస్​కు ప్రత్యేకంగా సోషల్​ మీడియా వింగ్​లు ఉన్నాయి. వీటిల్లో తమ పార్టీ నేతల ప్రసంగాలు, ప్రత్యర్థుల లోపాలను పోస్ట్ చేస్తూ... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అంతే స్థాయిలో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ఈ విషయంలో మజ్లిస్ కంటే.. అధికార తెరాస, భాజపా సోషల్ మీడియా వింగ్​లు ముందంజలో ఉన్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత..?

author img

By

Published : Dec 5, 2020, 5:10 AM IST

జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు ఏవైనా... సోషల్​ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. పంచాయతీ ఎన్నికలు మొదలు... పార్లమెంటు ఎన్నికల వరకు దాదాపు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటున్నాయి. అందులో కొన్ని పార్టీలు సమర్థవంతంగా వినియోగించుకున్నాయి. భాజపా ఇందులో మొదటి స్థానంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా... భాజపా సోషల్​ మీడియా వింగ్ నిరంతరం పనిచేస్తూ... శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. అంతే స్థాయిలో ప్రజలు ఆలోచించేలా పోస్టులు పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

తెరాస వర్సెస్ భాజపా..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస- భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇందుకు కారణాలు ఎన్ని ఉన్నా... అందులో ప్రధానమైనది సోషల్ మీడియా. ఇరు పార్టీలు ఎక్కడా తగ్గకుండా తమతమ గొంతును వినిపించేందుకు ఉపయోగించుకున్నాయి. ప్రధానంగా తెరాస, భాజపా ప్రత్యేక వింగ్​లు ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థుల లోపాలను, తమ బలాలను ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లగలిగాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా... కేసీఆర్, కేటీఆర్, అమిత్​ షా, బండి సంజయ్ వ్యాఖ్యలు ట్రోల్​గా మారాయి.

ఈ వ్యాఖ్యలకు ప్రచారం ఎక్కువ..!

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. తెరాసలో కేటీఆర్ అన్నీ తానై నడిపించగా.. భాజపా తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి... బూత్​ లెవల్ మెంబర్ వరకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఇరు పార్టీల నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వారిది దిల్లీ పార్టీ... మాది గల్లీ పార్టీ..

ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్... భాజపా దిల్లీ పార్టీ అని, తెరాస గల్లీ పార్టీ అని చేసిన కామెంట్ సామాజిక మాధ్యమాల్లోకి బాగా వెళ్లింది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు.. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్​ మీడియాలో వైరలయ్యాయి. అభివృద్ధి కావాలా..? అరాచకం కావాలా..? అనే నినాదాన్ని తెరాస వింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.

బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను భాజపా, తెరాస ఎవరికి వారు అనుకూలంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వరద సాయంపైనా ఇరు పార్టీల సోషల్​ మీడియా మధ్య పెద్ద దుమారం రేగింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్రహోంత్రి అమిత్​ షా... విలేకరుల సమావేశంలో కేసీఆర్ గురించి చేసిన కామెంట్స్ వైరలయ్యాయి.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావట్లేదని కేసీఆర్ అంటున్నారని ఓ జర్నలిస్టు అమిత్​షాను ప్రశ్న అడిగారు. దానికి బదులుగా... అసలు కేసీఆర్ సచివాలయానికి వస్తే కదా ఎంత ఇస్తున్నామో తెలిసేది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను భాజపా సోషల్​ మీడియా వింగ్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఉత్కంఠ రేపిన పోరులో ఆయా పార్టీల సామాజిక మాధ్యమ వేదికలు కీలక భూమిక పోషించాయని చెప్పాలి.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.