బాలీవుడ్లో సీక్వెల్స్ షరా మామూలే. విజయవంతమైన చిత్రాలకు కొనసాగింపులు రూపొందిచడం పరిపాటిగా మారింది. వెల్కమ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఇప్పడు మరో రెండు సీక్వెల్స్ తీయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.
జాన్ అబ్రహం, అనిల్ కపూర్, పరేష్ రావల్, నానా పటేకర్ ఈ చిత్రాల్లో ప్రధాన పాత్రధారులుగా నటించనున్నారు. 2007లో వచ్చిన మొదటి వెల్కమ్ చిత్రానికి అనీష్ బజ్మీ దర్శకత్వం వహించగా ఫిరోజ్ నడియాడ్వాలా నిర్మించారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, ఫిరోజ్ ఖాన్, నానా పటేకర్, పరేష్ రావల్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్ర కొనసాగింపుగా 2015లో వచ్చిన 'వెల్కమ్ బ్యాక్' కూడా విజయవంతమైంది.
ప్రస్తుతం ఒకేసారి వెల్కమ్ 3, వెల్ కమ్ 4 చిత్రాలను తెరకెక్కిస్తామని చిత్రబృందం ప్రకటించింది. రెండు చిత్రాలకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తారని.. మూడో చిత్రాన్ని 2020లో, నాలుగో సినిమాను 2021లో విడుదల చేస్తామని ప్రకటించింది. త్వరలోనే ఈ సీక్వెల్ సినిమాల చిత్రీకరణ ప్రారంభం కానుంది.
త్వరలోనే సెట్స్‌పైకి వెల్కమ్ 3, వెల్కమ్ 4 - వెల్ కమ్
బాలీవుడ్ లో విజయవంతమైన వెల్కమ్ చిత్రానికి రెండు సీక్వెల్స్ రూపొందేంచుకు చిత్రబృందం సిద్ధమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి నాలుగు నెలల వ్యవధిలో రెండు చిత్రాలను విడుదల చేయనున్నారు.