ETV Bharat / state

కరోనా జాగ్రత్తలపై ఈ నెల 25న వెబినార్ కాన్ఫరెన్స్‌ - కరోనా జాగ్రత్తల తాజా వార్తలు

కరోనా నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై హైదరాబాద్‌లో రెసిడెన్షియ‌ల్‌ వెల్ఫేర్ అసోసియేష‌న్లకు ఈ నెల 25న వెబి‌నార్ కాన్ఫరెన్స్ జ‌ర‌గ‌నుంది. ముంబయి, కోల్‌క‌త‌, న్యూ దిల్లీల‌తో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు పాల్గొన‌వ‌చ్చునని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా జాగ్రత్తలపై ఈ నెల 25న వెబినార్ కాన్ఫరెన్స్‌

author img

By

Published : Jul 22, 2020, 10:27 PM IST

కొవిడ్-19 నుంచి ర‌క్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై హైదరాబాద్‌లో రెసిడెన్షియ‌ల్‌ వెల్ఫేర్ అసోసియేష‌న్లకు ఈ నెల 25న వెబి‌నార్ కాన్ఫరెన్స్ జ‌ర‌గ‌నుంది. ఎన్‌ఐఆ‌ర్డీ, సీఆర్‌యూ, జీహెచ్‌ఎంసీ, డ‌బ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వెబినార్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు న‌గ‌రంలోని రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు ముంద‌స్తుగా త‌మ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి.

ఈ నెల 25న సాయంత్రం 4 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఈ వెబినార్ కాన్ఫరెన్స్‌లో ముంబయి, కోల్‌క‌త‌, న్యూ దిల్లీల‌తో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు పాల్గొన‌వ‌చ్చునని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకే‌శ్​ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో దాదాపు 2,300 రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు ఉన్నాయన్నారు. కొవిడ్‌-19కు సంబంధించిన జాగ్రత్తల‌పై ఈ కాన్ఫరెన్స్‌లో చ‌ర్చించ‌నున్నట్లు తెలిపారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు ఈ వెబినార్ కాన్ఫరెన్స్‌కు https://zoom.us/meeting/register/tJAsc-qoqTspH9O45f0xcmf1WX2YOLnsKG4n లింక్‌లో త‌మ వివ‌రాల‌ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్నవారు ఈ-మెయిల్ ద్వారా స‌మాచారం పొందుతారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ వెబి‌నార్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు క‌లిగిన అవ‌కాశాన్ని వినియోగించుకొని కరోనా నుంచి కాపాడుకునేందుకు నిపుణుల సూచ‌న‌ల‌ను పొంద‌వ‌చ్చునని కమిషనర్ వివరించారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.