అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చేనేత ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు దాస్ సురేష్ డిమాండ్ చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మార్కెట్ పోలీసులు తమపైన అక్రమ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. గతనెల 2న సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో కొన్న పట్టు వస్త్రాలను నకిలీవని గుర్తించామని తెలిపారు. యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాటు... మార్కెట్ పీఎస్లో ఫిర్యాదు చేశామని సురేష్ తెలిపారు. తమ ఫిర్యాదును నమోదు చేసుకోకపోగా... వారం రోజుల తరువాత తమపైనే అక్రమ కేసులు నమోదు చేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.
ఈ విషయంపైనా సీపీని సంప్రదించగా... నార్త్ జోన్ డీసీపీని కలువమని సూచించారని తెలిపారు. ఈరోజు డీసీపీ కలమేశ్వర్ను కలిసామని తెలిపారు. తమపైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని... నకిలీ పట్టు వస్త్రాలను అమ్ముతున్న షాపింగ్ మాల్పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేని యెడల తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కులం చెబితే కేసులు ఉండవా!