నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24గంటల్లో కేరళలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
అత్యధికంగా పోచంపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు