రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధంగా 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి : కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ.. బయోటెక్ రంగం బలోపేతానికి సూచనలు