రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడు రోజులు పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈరోజు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అనేక చోట్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఈ తరుణంలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా వర్షం రావచ్చని వెల్లడించింది.
ఇదీ చూడండి : బాలల హక్కుల సంఘం అధ్యక్షడు అచ్యుతరావు కన్నుమూత