ETV Bharat / state

'పుర ఎన్నికల్లో బలమున్న చోట మేమూ పోటీ చేస్తాం' - TDP NATIONAL PRESIDENT ON TELANGNA POLITICAL ISSUES

హైదరాబాద్​లోని తెదేపా ప్రధాన కార్యాలయం ఎన్​టీఆర్ భవన్​లో రాష్ట్ర నేతలతో పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బాబు సమీక్ష
author img

By

Published : Nov 3, 2019, 9:53 AM IST

పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బాబు సమీక్ష

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బలమున్న చోట పోటీచేయాలని తెదేపా ప్రాథమికంగా నిర్ణయించింది. హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో తెతెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. హుజూర్​నగర్ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అంశాన్ని కూడా నేతలు బాబుకు వివరించారు.

మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తమ అధినాయకుడిని కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

'పుర ఎన్నికలపై బాబుతో నేతల సమాలోచనలు'

పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో బాబు సమీక్షించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి మీడియా హక్కులను కాపాడటంలో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని.. అలాంటి విలేకరులకు సంకెళ్లు వేయడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని బాబు మండిపడ్డారు. మీడియా గొంతును నొక్కే జీవో 2430 రద్దుకు జర్నలిస్టు సంఘం చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.

త్వరలోనే తెదేపా పార్లమెంట్ కమిటీలు

త్వరలో పార్లమెంట్ కమిటీలను ప్రకటిస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా...లేక పొత్తు పెట్టుకోవాలా అనే అంశాన్ని అప్పటి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మె తదితర ప్రజాసమస్యలపై పార్టీ తరఫున పోరాడాలని బాబు సూచించినట్లు నర్సిరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి : 'నవంబర్​ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.