తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పనేలేదని (kcr clarify on 3 acres to dalits) ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానంటూ వివరణ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు మూడెకరాల భూమి కూడా ఇస్తారా.. అంటూ మజ్లిస్ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని.. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నామని చెప్పారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం..!
'దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం.'
- సీఎం కేసీఆర్
ఇదీచూడండి : Kcr On Trs Party: 'మాది రాజకీయ పార్టీ.. మఠం కాదు... ముందుండేది కూడా మేమే'