కరోనా సోకిన గర్భిణీలకు అన్నీ తామై సేవలు అందించారు గాంధీ ఆస్పత్రి గైనకాలజీ వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిపివేసినప్పటికీ.. కొన్ని నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన గర్భిణీలకు చికిత్స అందించిన ఘనత వారిది. 30 మంది సిబ్బంది ఉన్న గైనకాలజీ విభాగంలో 10 నెలల్లో 950మందికి కాన్పు చేసి వారికి సపర్యలు చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మహాలక్ష్మితో ప్రత్యేక ముఖాముఖి...