ETV Bharat / state

GOLD MERCHANTS: 'హాల్​మార్క్​ కొత్త నిబంధనలు ఎందుకో అర్థం కావడం లేదు' - gold shops strike in india

బంగారం హాల్​మార్క్​ యూనిక్​ ఐడీ (హెచ్‌యూఐడీ) నూతన నిబంధనలపై బంగారు వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త జ్యూయలరీ దుకాణాల ఒక్కరోజు బంద్​ పిలుపులో భాగంగా.. దుకాణాలు మూసివేసి ఆందోళన చేపట్టారు. నూతన విధానంతో దుకాణదారులు, వినియోగదారులు ఇద్దరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు.

GOLD MERCHANTS STRIKE
GOLD MERCHANTS STRIKE
author img

By

Published : Aug 23, 2021, 5:00 PM IST

Updated : Aug 23, 2021, 6:00 PM IST

బంగారం అభరణాల విక్రయాల్లో హాల్‌మార్క్ యూనిక్​ ఐడీ (హెచ్‌యూఐడీ) అమలును వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లోని పలు జ్యూయలరీ అసోసియేషన్స్​ బంద్​ నిర్వహించాయి. దేశవ్యాప్త జ్యూయలరీ దుకాణాల ఒక్కరోజు బంద్​లో భాగంగా.. ఆందోళన చేపట్టాయి. అబిడ్స్​లోని దుకాణాలను మూసేసి నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన హాల్​మార్క్​ యూనిక్​ ఐడీ (హెచ్​యూఐడీ) వ్యవస్థ అమలు అసాధ్యమని.. ట్విన్​ సిటీస్​ జ్యూయలరీ అసోసియేన్​ కార్యదర్శి ప్రవీణ్​కుమార్​ తెలిపారు. ఆరు అంకెల హాల్​మార్క్​ యూనిక్​ ఐడీ కోసం అస్సెయింగ్​ అండ్​ హాల్​మార్కింగ్​ సెంటర్​(AHC) వద్ద చాలా సమయం పడుతోందని.. ఫలితంగా నగరు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారన్నారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానాలపై నిజామాబాద్​ నగరంలోనూ బంగారు దుకాణాల మర్చంట్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. హాల్​మార్క్​ ప్రకారం కొనుగోలుదారుల ప్రయోజనాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కానీ హెచ్​యూఐడీ నిబంధనల ప్రకారం.. ప్రతి బంగారు దుకాణ వ్యాపారి తప్పకుండా కంప్యూటర్​ నిర్వహణ, ప్రతి నగకు స్కానింగ్, అప్‌లోడ్‌ చేసుకోవడం, విక్రయాల నమోదు చేయడం తదితర వివరాలను నిక్షిప్తం చేసుకోవడానికి అదనపు సమయం, ఆర్థిక భారం ఉంటుందన్నారు. ఈ నిబంధనలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

'హెచ్​యూఐడీతో వినియోగదారులకు లాభమేంటో అర్థంకావడం లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వం వివరించాలి. నూతన విధానంతో దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత విధానం చక్కగా అమలువుతున్నప్పుడు మళ్లీ హెచ్​యూఐడీ పద్ధతి ఎందుకు. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో వివరించాలి.'

- ప్రవీణ్ కుమార్, ట్విన్ సిటీస్ జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి

'మాకు హాల్​మార్క్​ పద్ధతితో ఎటువంటి సమస్య లేదు. హెచ్​యూఐడీతోనే అసలు సమస్య వచ్చింది. అందులోని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. హెచ్​యూఐడీ విధానాన్ని నిలిపివేయాలి.'

- అవినాష్ గుప్త, ఆల్ జేమ్స్ అండ్ జ్యూయలరి డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్

'కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన విధానంలో భాగంగా.. చాలా వివరాలు కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మేరకు సదుపాయాలు ఉండవు. ఇంకా వినియోగదారుల డేటాను సేకరించాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని.. సంబంధిత పోర్టల్​లో నమోదుచేయాల్సి ఉంటుంది. ఏ బంగారు దుకాణాదారుడు వినియోగదారుని సమాచారం పంచుకోడానికి సిద్ధం లేరు.'

- మహేందర్ తహెల్, హైటెక్ సిటీ జ్యూయలరీ మ్యానిఫ్యాక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఇవీచూడండి:

Last Updated : Aug 23, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.