ETV Bharat / state

కొవిడ్​ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్ - Corona latest news

కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కేసీఆర్ పాల్గొన్నారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సిన్‌ పంపిణీ వ్యూహంపై చర్చించారు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్న సీఎం.. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని... ప్రాధాన్యతా క్రమంలో అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కొవిడ్​ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్

author img

By

Published : Nov 24, 2020, 8:52 PM IST

కొవిడ్​ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్

శాస్త్రీయంగా ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎం పాల్గొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చాక వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు చెప్పారు.

వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్న సీఎం... శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా లేదా అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, కరోనా వైరస్ కూడా దేశమంతా ఒకే రకమైన ప్రభావాన్ని చూపలేదని అన్నారు.

కొన్ని రోజులు పరిశీలించి...

వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలని... ఆ తర్వాత పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి మిగతా వారికి ఇవ్వాలని సూచించారు. ప్రధాని సమీక్ష అనంతరం అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కోల్డ్​చైన్ ఏర్పాటు...

రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్‌ చైన్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్‌పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రాధాన్యతా క్రమంలో జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: గత చరిత్ర ఎంతో ఘనం... అభివృద్ధిలో అథమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.