రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జులై రెండో వారం ప్రారంభమైనా ఇప్పటి వరకు కనీస వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు 34 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుండడం వల్ల ఉత్తరాదిన వర్షాలు పడుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో కూడా పెద్దగా వానలు పడే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. అయితే నెల చివరి నాటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : ముంబయిపై మరోసారి వరుణుడి పంజా