భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గోదావరి వరద నీటి ప్రవాహానికి 200 ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. అన్నారం, కమలాపూరం, చినరాయిగూడెం గ్రామాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. వరద నీటిలో వరి, పత్తి చేలు పూర్తిగా నీట మునిగాయి.
కమలాపురం- అన్నారం గ్రామాల మధ్య ఉన్న రహదారిపైకి వరదనీరు ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచాయి. పేరంటాల చెరువులోని వరద నీరు పగిడేరు- సాంబాయిగూడెం రహదారిపై ప్రవహించగా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. వరద నీరు ముంచెత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : గోదారమ్మ ఉగ్రరూపం... భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక