ETV Bharat / state

పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

author img

By

Published : May 10, 2021, 5:15 PM IST

నాంపల్లి హజ్​హౌస్​లో రంజాన్ పండుగని పురస్కరించుకుని పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల కిట్ల​ను పంపిణీ చేశారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ సంయుక్తంగా అందజేశారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ... ప్రార్థనలలో పాల్గొనాలని వారు సూచించారు.

Waqf Board Chairman, Mla Gopinath, essentials Kits

దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీం అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హాజ్ హౌస్​లో రంజాన్ కానుకగా... నిత్యావసర సరకుల కిట్ల​ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​తో కలిసి అందజేశారు.

కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ముస్లిం భౌతిక దూరాన్ని పాటిస్తూ... ప్రార్థనలలో పాల్గొనాలని సూచించారు. మహమ్మరి కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిస్వార్థంగా పని చేస్తున్న వక్ఫ్ బోర్డ్​పై కొందరు కక్షపూరితంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల వారికి గౌరవం ఇస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.

ఇదీ చూడండి: హీరో ఎన్టీఆర్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.