ETV Bharat / state

సుస్వరాల లోకంలో... సుస్థిర కొలువులు

మానసిక సమస్యలను అధిగమించడానికి సంగీతం ఓ దివ్యఔషధంగా పని చేస్తుంది. గానం మీద ఆసక్తి ఉన్న వారు.. సంగీతాన్ని కెరియర్గా మలుచుకోవాలని అనుకుంటారు. మంచి సంగీతాన్ని ఆలపిస్తూ.. శ్రోతలను మంత్రముగ్ధులను చేయాలనుకుంటారు. కానీ అందుకు నైపుణ్యం ఉండాలి. సంగీతానికి సంబంధించి వివిధ విభాగాల్లో నైపుణ్యం సాధించడానికి ఉన్న అవకాశాలతో పాటు.. ఆ వృత్తిలో కొనసాగాలనుకుంటున్నవారు.. ఈ స్టోరీ తప్పక చదివి తీరాలి.

want to excel in the field of music, you have to master it where are the details
సుస్వరాల లోకంలో... సుస్థిర కొలువులు
author img

By

Published : Mar 11, 2021, 5:28 PM IST

మనసు సరిగా లేని సమయాల్లో ఉల్లాసాన్ని కలిగించే ఉత్తమ సాధనం సంగీతం. మానసిక సమస్యలను అధిగమించడానికి అదో దివ్యఔషధంగా పని చేస్తుంది. అలాగే శుభకార్యాల్లో అందరినీ అలరించేందుకు మ్యూజిక్ తప్పనిసరి. దీంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే సామర్థ్యం ఉన్నవారు ఈ రంగంలో రాణిస్తున్నారు. సంగీతానికి సంబంధించి వివిధ విభాగాల్లో నైపుణ్యం సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పాటల రచయితలు, గాయకులు, మ్యుజీషియన్లు, ఇన్స్ట్రుమెంటల్ ఆర్టిస్టులు, కీబోర్డు ప్లేయర్లు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యూజిక్క్రిటిక్ వంటి కెరియర్లు అందుబాటులో ఉన్నాయి.

సంగీతమే కెరియర్గా మలుచుకోవడమనేది మంచి నిర్ణయమే అయినా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ఈ రంగంలో ఎంతవరకు రాణిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కెరియర్ తొలినాళ్లలో కొంత అయోమయం, ఆందోళన ఉండటం సహజమే అయినా భయపడకుండా ఎంతోమందిని సంగీత సాగరంలో ముంచెత్తడానికి సిద్ధం కావాలి. ముఖ్యంగా నాలుగు అంశాలు సంగీతరంగంలో భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తాయి.

1. వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి

సంగీత రంగంలో రాణించాలనుకుంటే అందులో నైపుణ్యం ఉండాలి. దానిపై విస్తృతమైన అవగాహనపెంచుకోవాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం, సంగీతం వినడం, అర్థం చేసుకోవడం, అనుసరించడం తదితర అంశాలపై దృష్టి సారించాలి. వీలైనంత సమయాన్ని వెచ్చించాలి. అలా వాటిపై అవగాహనను పెంచుకున్న తర్వాత వాటి మీద సాధన చేయాలి. నిత్యం అత్యధిక సమయం దానికే కేటాయించాలి. దీనివల్ల మీరు దేనికోసం కృషి చేస్తున్నారో ఆ దిశగా అడుగులు పడతాయి.

2. విస్తృత పరిచయాలు చేసుకోవాలి

సంగీతంలో నైపుణ్యాలను పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. మ్యూజిక్.. సమాజానికి చెందిన కార్యకలాపం. కాబట్టి ఈ రంగంలోకి వెళ్లేవారు కమ్యూనిటీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్​ నెట్వర్క్​ను విస్తృతం చేసుకోవాలి. ఇతరులతో పరస్పర అవగాహనతో మెలగాలి. వారితో సంగీత మెలకువలను పంచుకుంటూ ముందుకు సాగాలి.

3. అవకాశాలను అందిపుచ్చుకోవాలి

సంగీత ప్రపంచం ఇతర రంగాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో అవకాశాలు రావడం చాలా కష్టం. వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. అందుకే కెరియర్ పరంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అవకాశాల కోసం మనమే చొరవ చూపాలి. అలా చేయాలంటే సంగీత పరిశ్రమ, ఎవరి పని ఏమిటి, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై లోతైన అవగాహన ఉండాలి. అలాగే ఈ రంగంలో పోటీ ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్​పై దృష్టి పెట్టాలి.

4. స్థిరంగా కొనసాగాలంటే..

ఈ వృత్తిలో స్థిరంగా కొనసాగాలంటే బలమైన పునాది వేసుకోవాలి. అందులో భాగంగా ఈ విభాగంలో డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరి పూర్తి చేయాలి. వైవిధ్యమైన సంగీతం, గానం, రచనలకు ఇక్కడ ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగించాలి. నిత్యం కొత్త విషయం నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగి ఉండాలి. నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సాధన కొనసాగిస్తూనే ఉండాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రంగంలో ఉన్నతంగా నిలబెడతాయి.

కోర్సులను అందిస్తున్న సంస్థలు

సంగీతంలో నైపుణ్యాలు మెరుగు పరుచుకోడానికి పలు విద్యాసంస్థలు సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టొరల్ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ, సెయింట్ జేవియర్స్ కాలేజీ, త్యాగరాజు సంగీత కళాశాల, ఏఆర్ రెహమాన్కేఆర్ మ్యూజిక్ కన్జర్వేటరీ, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పంజాబ్ యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ ప్రధానంగా ఉన్నాయి. ఇంటర్ తర్వాత డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీలో 6, తెలంగాణలో 6 కళాశాలలు సంగీత, నృత్యం విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

ఇదీ చదవండి: రివ్యూ: కడుపుబ్బా నవ్వించే 'జాతిరత్నాలు'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.