హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ విలేజ్ రెవిన్యూ అసోసియేషన్ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ అన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు బాలమణి కోరారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, కొత్త రెవెన్యూ చట్టం కూడా విజయవంతమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేసి.. ఏ విభాగానికి బదిలీ చేసినా బాధ్యతగా విధులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్