ETV Bharat / state

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ - తెలంగాణ ఎన్నికలలో ఓటు పై అవగాహన

Vote Awareness Program in Telangana Assembly Election 2023 : ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం.. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో భాగస్వామ్యమై.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలని మేధావులు చైతన్య పరుస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు.

Governor Tamilisai Awareness on Vote
Vote Awareness Program for Telangana Assembly Election
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 11:15 AM IST

ప్రజా స్వామ్యంలో ఓటు చాలా కీలకం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : తమిళిసై సౌందర రాజన్

Vote Awareness Program in Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రజా స్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. ఒక్క ఓటు తమ తల రాతలు మార్చడంతో పాటు భావితరాలకు దిశానిర్దేశం చేస్తుంది. మంచి నాయకుడిని ఎంచుకోవడం వల్ల మన భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల వేళ ఓటర్లకు అవగాహన కల్పించేలా పలువురు నడుంబిగించారు.

Governor Tamilisai Awareness on Vote : ఈ నెల 30న పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుందన్న గవర్నర్.. గురువారం ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఇట్స్‌ ఓటర్‌ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

"అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను." - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

Ram Gopal Varma Awareness On Vote : హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చిత్రకారుడు రమణరెడ్డి ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కర్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ఆయన.. నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రలోభాలకు తావులేకుండా విస్తృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

Vote Awareness Program for Assembly Election : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ.. ఓరుగల్లులో రిటైర్డ్ ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియక చాలా మంది మద్యానికి, డబ్బు కు ఓటును అమ్ముకుంటున్నారు. పోలీసులకు ప్రజలకు మధ్య అవినోభావ సంబంధం ఉంటుంది కాబట్టి.. వారు చెబితే ప్రజలు ఆచరిస్తారనే ఉద్దేశంతో హైదరాబాద్ అంబర్ పేట్ పోలీస్ శిక్షణా కళాశాల ఉన్నత అధికారులు తమ వంతు కృషిచేస్తున్నారు.

గత ఇరవై రోజలుగా వారు నటించిన లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఓటర్ చేయల్సిన, చేయకూడని పనులు.. ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా మద్యం, డబ్బు అక్రమాలకు పాల్పడితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తదితర అంశాల గురించి వివరిస్తున్నారు.

నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్​కు పకడ్బందీ గస్తీ

తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.