VOIP Cyber Frauds : సైబర్ మోసగాళ్లు పక్కనే ఉండి ఫోన్ చేసినా.. తెలుసుకోవడం కష్టం. నిలువునా దోచేసినా పట్టుకోవడం కష్టతరమే. కేటుగాళ్లు ‘వీవోఐపీ’ ఉపయోగిస్తుండటమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా బెదిరింపులు, కిడ్నాప్‌ల వంటి నేరాలకు వీవోఐపీ(Voice over Internet Protocol) కాల్స్ వాడుతుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఈ కాల్స్‌ను వినియోగించి.. సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ చెలరేగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వీఓఐపీ అంటే..: సాధారణంగా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్(Service Provider)కు చెందిన సర్వర్ నుంచి టవర్ల ద్వారా అవతలి వ్యక్తికి చేరుతుంది. అయితే అప్పుడు ఫోన్ ఎవరు చేశారో నంబర్ అధారంగా గుర్తించవచ్చు. ఏదైనా కంప్యూటర్‌కు అనుసంధానమై, అంతర్జాలం అందుబాటులో ఉంటే చాలు.. వీవోఐపీ కాల్ చేయొచ్చు. అంతేకాదు.. మానకు కావాల్సిన నంబరు నుంచి చేయొచ్చు. అటువైపు ఉన్న వ్యక్తికి.. ఫోన్ చేసిన వ్యక్తి నంబరు కనిపించకుండా కూడా చేయవచ్చు.
Hyderabad Police Arrested Cyber Gang : సైబర్ మోసాల్లో 'ఉగ్ర' లింకుల కలకలం
Cyberabad Police Raids on Fake Call Center : కావాల్సిన నంబరు ఫీడ్ చేసుకొని, దాని ద్వారా ఈ వీవోఐపీ కాల్ చేయొచ్చు. అప్పుడు ఫోన్ వచ్చిన వారికి ఈ నంబరు మాత్రమే కనపడుతుంది. వాస్తవానికైతే ఫోన్ చేసిన వ్యక్తికి అసలు సిమ్ కార్డే ఉండదు. కంప్యూటర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈ కారణంగానే ఎవరు ఫోన్ చేశారు.. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో గుర్తించడం కష్టమవుతుంది.
అంతర్జాతీయ కోడ్ నంబర్లతో..: సాధారణ ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదవుతున్నాయని, ఎప్పుడోకసారి పట్టుబడే అవకాశం ఉందని.. పైగా ఇలాంటి నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు చాలామంది స్పందించడం లేదని భావిస్తున్న సైబర్ నేరగాళ్లు.. వీవోఐపీ ద్వారా విదేశాల నుంచి కానీ, ఏదైనా దర్యాప్తు సంస్థ(Investigation Agency) నుంచో ఫోన్ చేస్తున్నట్లు భ్రమని కల్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురికి 92, 96, 97 వంటి అంతర్జాతీయ కోడ్‌తో మొదలవుతున్న నంబర్లతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఈ కేటుగాళ్లు. సొమ్ము పోగొట్టుకున్నాక పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నా.. వారికి ఏ మాత్రం ఫలితం ఉండటంలేదు. లోన్ యాప్‌ల నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు.
ముందుజాగ్రత్తే మేలు : ఇటువంటి ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గమని.. తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో మోసగాళ్లు ఏదో ఒక నంబరు డయల్ చేస్తారు. ఫోన్ ఎత్తిన వ్యక్తి వివరాలూ కేటుగాళ్ల దగ్గర ఉండవు. వారి మాయ మాటలతో మాటల్లో పెట్టి బాధితుడి ద్వారానే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చెస్తారు. ఇలాంటి సందర్భాల్లో వారితో జాగ్రత్తగా ఉండాలి. తాము ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని అవతలి వ్యక్తి చెబితే.. ఆ బ్యాంకు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి దాని గురించి ఆరా తీయాలి. అనుమానాస్పద నంబర్లు అనిపిస్తే.. వాటి గురించి వెంటనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం(DOT)కు చెందిన 1800110420, 1800111963 నంబర్లకు తెలియజేయాలి.
Loan App Harassment Hyderabad : లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్‌ఫుల్ బ్రదర్!