ETV Bharat / state

విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం - విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం వార్తలు

ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మను దర్శించుకునేలా సౌకర్యాలు కల్పించినా... కరోనా దృష్ట్యా సిరిమానోత్సవాన్ని మాత్రం భక్తులు లేకుండా సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించారు.

విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం

author img

By

Published : Oct 27, 2020, 8:38 AM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి జాతర ఈనెల 7న ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో తొలేళ్లు, సిరిమానోత్సవం ప్రధాన ఘట్టాలు. వీటిని ఏటా క్రమంగా తప్పుకుండా నయానందకరంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఒడిశా నుంచీ పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాల‌ని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ మేరకు ప్రజా రవాణాను నిలిపివేసింది. దుకాణాలను సైతం మూసివేయించారు. ఉచిత దర్శనాలనూ నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సిరిమాను రథం వెనుక వందల మంది కార్యకర్తలు తిరిగే అవకాశమున్నందున వారినీ వీలైనంత తక్కువగా అనుమతించాలని నిర్ణయించారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూనే భ‌క్తులను నియంత్రించాలని నిర్ణయించారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3 వేల మంది పోలీసులు 2 విడతల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 11మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు భద్రతను పర్యవేక్షించనున్నారు. స్థానికులనూ సిరిమానోత్సవ ప్రాంతానికి రాకుండా కట్టడి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అమ్మవారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పులివేషాలు, ఘటాల ప్రదర్శనలనూ అధికారులు నిషేధించారు. ఉత్సవం జరుగుతున్నప్పుడు జనం గుమిగూడకుండా ప్రతి వార్డుకు రెండు ఎల్​ఈడీ తెరలను ఏర్పాటు చేసి అమ్మవారి పూజ‌ల‌ు, సిరిమానోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.