ETV Bharat / state

అక్బరుద్దీన్​ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ నిరసనలు​

మజ్లీస్​ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ హిందువులపై చేసిన  వ్యాఖ్యలకు  నిరసనగా విశ్వహిందూ పరిషత్​ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అక్బరుద్ధీన్​ను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది.

అక్బరుద్దీన్​ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ నిరసనలు​
author img

By

Published : Jul 26, 2019, 8:54 PM IST

అక్బరుద్దీన్​ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ నిరసనలు​

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా... విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా...దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తక్షణం అక్బరుద్దీన్​ను అరెస్ట్ చేయాలని... లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. జులై 29న అన్ని జిల్లాల్లో కేసీఆర్, అక్బరుద్దీన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. జులై 31న హైదరాబాద్​లో నిరసనలు, దిష్టిబొమ్మల దహనం చేస్తామని... అప్పటికీ అరెస్ట్ చేయకపోతే... ఆగస్టు 7న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: లైవ్​: ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.