ETV Bharat / state

అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?

ఇప్పుడు ఆర్​.ఆర్​. వెంకటాపురం పరిస్థితేంటీ? అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో.. నీటిని తాగితే.. ఏమవుతుంది? ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు ఆలోచించాల్సిన అంశాలివే. ప్రస్తుతం ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రమాదం జరిగిన తరవాత వేరేచోటుకు తరలి వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. తగ్గట్టుగానే...పరిశ్రమకు మూడు కిలోమీటర్ల పరిధిలో స్టైరీన్ ఆనవాళ్లున్నాయని తేలటం...వారి భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?
అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?
author img

By

Published : May 13, 2020, 12:12 AM IST

అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?

స్టైరీన్ గ్యాస్ లీకేజ్ ప్రస్తుతానికి ఆగింది. ఇప్పుడు అక్కడివారు కాస్తో కూస్తో మంచి గాలి పీలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆసుపత్రిలో కోలుకుంటున్నారు బాధితులు. ఆ రోజు జరిగిన సంఘటనే అందరి కళ్ల ముందు కదులుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్‌.ఆర్‌. వెంకటాపురం నుంచి వేరే ప్రాంతానికి తరలిపోయిన వారు ఇంటి బాట పడుతున్నారు. కానీ...ఏదో తెలియని భయం వారిని వెంటాడుతోంది. పరిస్థితులు అంతా చక్కబడ్డట్టేనా..? మళ్లీ ఆ విష వాయువు కమ్ముకొస్తుందా..? ఇలా తమలో తాము మదనపడిపోతున్నారు...ఆ ప్రాంత ప్రజలు.

వీరి భయాలకు తగ్గట్టుగానే అక్కడి వాతావరణ పరిస్థితులున్నాయని తేల్చి చెప్పింది కేంద్రం నియమించిన నిపుణుల బృందం. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్)​, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్‌-నీరి నిపుణులు. విశాఖ విషవాయువు ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎల్జీ పాలిమర్స్‌ సమీప ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్టైరీన్‌ బారినపడి అస్వస్థతకు గురైనవారికి ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయాలని, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు.

పరిశ్రమకు మూడు కిలోమీటర్ల పరిధిలోని 5 గ్రామాల్లో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించొద్దని నిపుణుల బృందం సూచించింది. అక్కడి గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించవద్దని, స్థానిక పాల ఉత్పత్తులు ఎవరూ వాడొద్దని తెలిపింది. పశువులు ఆ గాలి పీల్చడం వల్ల కడుపులో ఇంకా పాలిమర్ అవశేషాలు ఉంటాయని.. వాటి పాలు తాగితే చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

విషవాయువు దుర్ఘటన తర్వాత పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి. నాలుగు రోజుల తరవాత గ్రామస్థులను తిరిగి ఇళ్లలో చేరడానికి అనుమతిస్తున్నారు. అయితే... పాలిమర్స్‌ పరిశ్రమకు సమీపంలోని కొన్ని రహదారులు, ఇళ్లలోను స్టైరీన్‌ అవశేషాలున్నాయని నిపుణుల బృందం గుర్తించింది. గరిష్ఠంగా ఓ ఇంటి వద్ద 1.7 పీపీఎమ్‌ స్టైరీన్‌ ఉన్నట్లు తేలింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. వీటితోపాటు మరికొన్ని సూచనలు చేసింది నిపుణుల బృందం.

  • ఇళ్లకు వచ్చినప్పుడు ఆయా ఇళ్లల్లో తలుపులు, కిటికీలు అన్నీ తెరిచే ఉంచాలి. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇళ్లలోని గచ్చులను శానిటైజర్లు, ఇతర రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి. వంట గదులు, ఫ్రిజ్‌లో ఉండిపోయిన కూరగాయలు, ఆహార పదార్థాలు తొలగించాలి. వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి. బయట ఉండే దుస్తులు, బెడ్‌షీట్లు, కర్టెన్లు ఉతికే వరకు ఎండలో పెట్టాలి. ఇళ్లలో దుర్వాసన పోగొట్టడానికి రూంఫ్రెషనర్స్‌ వాడొద్దు. సంప్రదాయ దూపం, అగరబత్తీలు వెలిగించాలి.
  • తాగడానికి, వంటకు బహిరంగ నీటి వనరుల నీటిని వినియోగించవద్దు. కార్లు ఉంటే శుభ్రం చేసుకున్న తర్వాతనే వినియోగించాలి. గాలి, నీరు, మట్టి నమూనాలను పరీక్షించి స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాల పర్యవేక్షణ చేస్తుండాలి. స్టెరీన్ గ్యాస్ లీకేజ్ వల్ల అక్కడ అంతా పాలిమర్ రూపంలో అణువులు నిక్షిప్తమయ్యాయి. అవి పడ్డ ఏ ఆహార పదార్థం తినకూడదనేది నిపుణులు చెబుతున్న మాట. చెరువులు, కుంటలు, బావుల్లో ఉన్న తాగునీరు పనికి రాదు. ఆకుకూరలు, కూరగాయలు, పంటలు తినేందుకు అనువుకాదు. కాకపోతే వాటిలో ఎంత మేరకు పాలిమర్ శాతం ఉందనేది పరీక్షలు జరిపిన తర్వాతే తెలుస్తుంది.
  • సీఎస్‌ఐఆర్‌-నీరి సిఫార్సులు అమలు చేయడానికి విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ప్రత్యేకంగా కమిటీలు నియమించారు. జీవీఎంసీ, ఈపీడీసీఎల్‌, వ్యవసాయ, పశు సంవర్థక శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు వాటి బాధ్యతను అప్పగించారు. సోమవారం సాయంత్రం నుంచే ఎల్జీ పాలిమర్స్‌ పరిసర గ్రామస్థులు తిరిగి ఇళ్లకు చేరుతుండడం వల్ల వారికి అవగాహన కల్పించేలా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు రూపొందించారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన తరువాత ఏం చేయాలి? ఏం చేయకూడదో? తెలిసేలా కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.
  • సంవత్సరం పాటు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనీ నిపుణుల బృందం తెలిపింది. ఈ మేరకు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోకు సూచించారు కలెక్టర్ వినయ్‌చంద్‌. పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు బృందాలను నియమించాలని వ్యవసాయ, పశుసంవర్థక శాఖలను అప్రమత్తం చేశారు. జీవీఎంసీ చేపట్టే వాటరింగ్‌ సమయంలో విద్యుత్తు సరఫరా ఆఫ్‌లో ఉండాలని ఈపీడీసీఎల్‌కు సూచించారు.
  • మొత్తంగా కేంద్రం నియమించిన బృందం తేల్చిన ఒకే ఒక మాట...అక్కడి వాతావరణం అంతా పూర్తిగా కలుషితమైందని. పాలిమర్ రూపంలో స్టైరీన్ అవశేషాలు సూక్ష్మ ధాతువులుగా ఉండిపోయాయి. మరికొద్ది రోజుల వరకు ఆ ప్రభావం ఉండనుంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యథాస్థితికి వచ్చేలా లేదు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా...ప్రజల్లో భయాందోళనలు తగ్గటానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: విషవాయువు కమ్మేసింది.. గుండెల్ని మెలిపెడుతోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.