గతంలో హైదరాబాద్‌లో స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తయారీ రంగ విప్లవాన్ని తీసుకొచ్చాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన 16వ విడత మ్యాన్ఎక్స్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఫార్మా, ఏరోస్పేస్ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయని... దీనితో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. ఇక్కడ ఫార్మా రంగం దేశంలోనే ఉత్తమమైనదిగా పరిగణిస్తారని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇదీ చూడండి: వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం.. సామాన్యుడికి చుక్కలు