తెలంగాణ సంగీత నాటక అకాడమీ అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వర్చువల్ బాలల రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. చిన్నారులు వివిధ అంశాలతో కూడిన నాటకాలను ప్రదర్శిస్తూ... తమ ప్రతిభను చాటుతున్నారు. 9వ రోజు నాటకాలను చిన్నారులు ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు. పదహారవ శతాబ్ధం నాటి భువన విజయం నాటకం అక్షర కాన్సెప్ట్ హై స్కూల్ జడ్చర్ల విద్యార్థులు ప్రదర్శించి మెప్పించారు. దీనికి వనజ రచన, దర్శకత్వం వహించారు.
అదేవిధంగా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ జహీరాబాద్ విద్యార్థులు నాటితరం, నేటి తరం అనే నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం దివ్య. ఇందులో ప్రకృతి పచ్చదనం పరిరక్షణ జల సంరక్షణ గృహవైద్యంలోని చిట్కాలు ఆచార సంప్రదాయాలు సంబంధించి నాటితరం ఏ విధంగా ఉంది... నేటి తరం ఎలాంటి అనర్థాలకు గురి అవుతున్నారు... నాటి నేటి తరాన్ని పోలుస్తూ కుటుంబ బాంధవ్యాలను ముడి వేసే విధంగా చక్కటి ప్రదర్శన చేసి విద్యార్థులు మెప్పించారు.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు