ETV Bharat / state

లాక్​డౌన్​ బేఖాతరు.. లక్ష 40వేల వాహనాలు సీజ్​ - నిబంధనలు పాటించని వాహనాలు సీజ్​

లాక్​డౌన్​ నిబంధనలు పాటించని సుమారు లక్ష నలభై వేలకు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

violating lock down rules 1 lack 40 thousand vehicle were seized by traffic police
లాక్​డౌన్​ బేఖాతరు.. లక్ష 40వేల వాహనాలు సీజ్​
author img

By

Published : Apr 25, 2020, 3:09 PM IST

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి.. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. అకారణంగా బయటికివస్తోన్న వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు లక్ష నలభై వేలకు పైగా వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. వీటిలో లక్షా 36 వేల ద్విచక్ర వాహనాలు, 5,660 త్రిచక్ర వాహనాలు, 4,600 కార్లు, 600కు పైగా భారీ వాహనాలున్నాయి.

జరిమానా విధించిన వాహనదారులైతే 15 లక్షలకు పైగానే ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ను పాటించి.. ఇళ్లల్లోనే ఉండి తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.