'ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 40 - అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020' జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన శ్రీహర్ష మాజేటి రూ. 1,400 కోట్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ గతేడాది స్థాయిలోనే ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపార రంగంలో సొంతంగా ఎదిగి సంపన్నులుగా మారిన నలభై ఏళ్లలోపు యువకుల జాబితాను 'ఐఐఎఫ్‌ఎల్ వెల్త్- హురున్ ఇండియా' సంస్థ వెల్లడించింది. ఫుడ్ డెలివరీ యాప్ మాతృ సంస్థ బుందిల్ టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడే ఈయన.
మొదటి పది స్థానాలు పొందిన వ్యక్తులు | ||
పేరు | సంస్థ | సంపద (రూ. కోట్లలో) |
నితిన్ కామత్, నిఖిల్ కామత్ | జెరోధా | 24,000 |
దివ్యాంక్ తురఖియా | మీడియా.నెట్ | 14,000 |
అమోద్ మాల్వీయ | ఉడాన్ | 13,100 |
సుజీత్ కుమార్ | ఉడాన్ | 13,100 |
వైభవ్ గుప్తా | ఉడాన్ | 13,100 |
రిజు రవీంద్రన్ | థింక్ అండ్ లెర్న్ | 7,800 |
బిన్నీ బన్సల్ | ఫ్లిప్‌కార్ట్ | 7,500 |
సచిన్ బన్సల్ | ఫ్లిప్‌కార్ట్ | 7,500 |
రితేష్ అగర్వాల్ | అరవెల్ స్టేస్ | 4,500 |
భవీష్ అగర్వాల్ | ఏఎన్ఐ టెక్నాలజీస్ | 3,500 |
జెరోధా స్టాక్‌బ్రోకింగ్ వ్యవస్థాపకులైన నితిన్ కామత్, నిఖిల్ కామత్‌కు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది. మీడియా.నెట్‌కు చెందిన దివ్యాంక్ తురఖియా రెండు, ఉడాన్కు చెందిన ఆమోద్ మాల్వీయ మూడు స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్, థింక్ అండ్ లెర్న్, ఏఎన్ఐ టెక్నాలజీస్, జొమాటో ఇండియా సంస్థల వ్యవస్థాపకులూ ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో చోటు సంపాదించిన ఏకైక మహిళ.. వీయూ టెక్నాలజీస్ ప్రారంభించిన దేవితా సరాఫ్. ఆమె రూ. 1,200 కోట్ల సంపదతో 16వ స్థానంలో నిలిచారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్ దాఖలు