చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చని కానీ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవాలు కనుక్కోవడం ఎవరి తరం కాదన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో నిధులు ఏవని ప్రశ్నించారు. విషజ్వరాలు విజృంభిస్తున్నా.. ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించడం లేదని వాపోయారు.
ఇవీ చూడండి: బడ్జెట్: సంక్షేమం, నీటి పారుదలకు పెద్దపీట