రోగుల మంచాలు, ఔషదాల కొనుగోళ్లలో అవకతవకలపై హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ అధికారులకు విజిలెన్స్ నోటీసులు జారీ చేసింది. 34 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావాళిని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మరో వైద్యుడు నిమ్మ సత్యనారాయణకు పంపించారు. నాగరాజు పేరుతో నిమ్స్ డైరెక్టర్ నియామకంతో పాటు ఆసుపత్రిలో పెద్ద ఎత్తున నకిలీ వైద్యులు చలామణీ అవుతున్నారని... ఇతర అవినీతి అంశాలపై ఫిర్యాదులు రావడం వల్ల సమాధానం ఇవ్వాలంటూ విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరిన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ బృందం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...