ETV Bharat / state

VENKAIAH: 'కొవిడ్​ నిబంధనలు-మార్గదర్శకాలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య - telangana latest news

ఆరోగ్య సిబ్బంది కోసం ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 'కొవిడ్​ నిబంధనలు-మార్గదర్శకాలు' అనే పుస్తకాన్ని రూపొందించారు. హైదరాబాద్​లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

'కొవిడ్​ నిబంధనలు-మార్గదర్శకాలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

author img

By

Published : Sep 6, 2021, 10:34 PM IST

ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'కొవిడ్ నిబంధనలు-మార్గదర్శకాలు' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. నిత్యం వందల మంది బాధితుల సమస్యల పరిష్కారంలో తలమునకలయ్యే ఆరోగ్య సిబ్బంది.. కొవిడ్​ బారినపడకుండా తమను తాము కాపాడుకునేందుకు ఈ పుస్తకం దిక్సూచిలా పని చేస్తుందని ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ జి. నాగేశ్వర్​రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు.

కరోనా బాధితుల చికిత్సలో విశేష కృషి చేసిన తమ సిబ్బంది అనుభవపూర్వకమైన, శాస్త్రీయతతో కూడిన మార్గదర్శకాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జి.నాగేశ్వర్​రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది వైద్యులకు ఈ పుస్తకాన్ని ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కొవిడ్​కు సంబంధించి పాశ్చాత్య దేశాల మార్గదర్శకాలను కాపీ చేయకుండా.. దేశంలో కొవిడ్ వైరస్​ల మార్పులు, భౌగోళికంగా చూపిన ప్రభావం ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ కొవిడ్ నిబంధనలకు సంబంధించిన డిజిటల్ ప్రతిని ఏఐజీహాస్పిటల్స్.కామ్ ​లో పొందవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Hyderabad rain: అలర్ట్​ హైదరాబాద్‌... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.