Vice President On Agriculture:సేంద్రియ విధానం వైపు మళ్లడమే సరైన ప్రత్యామ్నాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఎమ్ఎస్ స్వామినాథన్ అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఐసీఏఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు.
అనుబంధ రంగాలపై దృష్టి పెట్టండి
ms Swaminathan award: జయశంకర్ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావుకు ఎమ్ఎస్ స్వామినాథన్ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందజేశారు. భవిష్యత్తులో పంటల వైవిధ్యతకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. డిమాండ్ పంటలు ఎంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. స్వదేశీ, విదేశీ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు .
అన్నానికి, అమ్మకు ప్రత్యామ్నాయం లేదు: సింగిరెడ్డి
Niranjan reddy: రాబోయే తరాలకు వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సృష్టిలో ప్రతి జీవికి ఏదో ఒకరూపంలో ఆహారం అవసరమని తెలిపారు. ఎవరైనా సరే ఎంత పెద్దస్థాయిలో ఉన్నా కూడా వ్యవసాయంపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నానికి, అమ్మకు సృష్టిలో ప్రత్యామ్నాయం లేదని మంత్రి అన్నారు. మాతృమూర్తిలాగే మాతృభూమికి కూడా ప్రత్యామ్నాయం లేదన్నారు.
అన్నం కావాలంటే రైతు కావాలి. రైతుకి రుణంతో పాటు మన మద్దతు కావాలి. ప్రకృతి వైపరీత్యాలకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది రైతే. రైతుకు మనం ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. కేంద్రం, రాష్ట్రాలు రైతుల కోసం కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ కొత్త సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయంపై ఆధారపడినవారికి కష్టానికి తగిన ఆదాయం వచ్చేలా చూడాలి. రైతు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు పోవాలి. ఫిషరీస్, పౌల్ట్రీ తదితర రంగాలపై దృష్టి పెట్టాలి. -ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
138 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అన్నానికి కొరత లేకుండా చేసిన పుణ్యమూర్తి ఎమ్ఎస్ స్వామినాథన్. వారి పేరును ఏర్పాటు చేసిన ఈ అవార్డు మన రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపకులపతికి రావడం సంతోషం. ప్రస్తుతం మానవుడు ఏదైనా సృష్టిస్తూ తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకున్నాడు. ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా ఆహారం లేకుండా ఏ జీవి ఉండలేదు. ఏదో ఒకరూపంలో ఆహారం కావాలి. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వ్యవసాయంపై అవగాహన ఉండడం అవసరం. రేపటి తరానికి అవగాహన కల్పించే బాధ్యత మనదే. ఇవాళ మనం గ్రామీణ ప్రాంతాల అభిృవృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సృష్టిలో అమ్మకు కూడా ప్రత్యామ్నాయం లేదు. రాబోయే తరాలకు అధికారులు, శాస్త్రవేత్తలు వ్యవసాయ ఫలాలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి
- ఇదీ చూడండి:
- Black rice: సేంద్రియ పద్ధతిలో బ్లాక్ రైస్.. ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ ఉద్యోగి
- niranjan reddy on crop: 'దేశంలో యాసంగిలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ'
- Agricultural Education Day: వ్యవసాయ విద్యలో సాంకేతికత.. దేశార్థికానికే కీలకం
- agriculture problems in India: సాగు విధానం, పంట మార్పిడి అంశాలపై నిపుణుల మాటేంటి?
- సేంద్రియంలో శ్రీలంక తప్పిదాలు.. భారత్‌కు పాఠాలు