వర్షపు నీరు సంరక్షణ, ఎనర్జీ సేవింగ్, పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించే వారిని ప్రోత్సహిస్తే. హరిత భవనాల నిర్మాణం ఊపందుకుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వెంకయ్య.. గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ దృష్టి సారించి స్థానిక సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు.
పర్యావరణాన్ని కాపాడుకుంటే సమస్యలు ఉండవని, పర్యావరణాన్ని పట్టించుకోకపోవటం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తరచూ వరదలు, కరవు లాంటివి చూస్తున్నామని, గ్లోబల్ వార్మింగ్‌పై విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
- ఇదీ చదవంండి : మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు