ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆమె హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వినాయకుడికి పార్టీ కండవా మెడలో వేయడం తీవ్రమైన చర్య అని వారు ఆక్షేపించారు. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కవిత వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిఘా పెట్టాలన్నారు. ఓట్ల కోసం దేవుళ్లను వాడుకోవడం మంచిది కాదన్నారు. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ నేతలు ఇతర పార్టీలకు ఏజెంట్లు లేకుండా భయాందోళనకు గురి చేస్తున్నారని.. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ