ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సచివాలయం మీద ఉన్న ప్రేమ.. ప్రజల ప్రాణాల మీద లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కో కుటుంబానికి 4 వేలు ఇస్తున్నారని... కేసీఆర్ పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్ ముందు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ నిరసన తెలిపితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆక్షేపించారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఏమైనా హత్యలు చేశారా అని వీహెచ్ ప్రశ్నించారు. గతంలో తాము అణచివేత చేసి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదన్నారు.
క్రికెటర్ కోహ్లీ దంపతులు రెండు కోట్లు ఇచ్చారని... మంత్రి మల్లారెడ్డి దోచుకున్న దానిలో కొంత దానం చేయాలన్నారు. ప్రధాని మోదీకి ఎన్నికల ముందు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మీద ఉన్న ప్రేమ.. ఇప్పుడు ఏమైందని నిలదీశారు.
ఇదీ చూడండి: చిన్న తరహా పరిశ్రమలకు అండగా నిధుల మంజూరు