ETV Bharat / state

ఆజాద్​ది పదవి ఉంటే ఓమాట.. లేకపోతే ఇంకోమాట: వీహెచ్ - sonia gandhi

కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాంనబీ ఆజాద్​ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్​ నేత వి.హనుమంతరావు అన్నారు. గులాంనబీ పదవి ఉంటే ఒక్కమాట... పదవి లేకపోతే ఇంకోమాట మాట్లాడుతారని మండిపడ్డారు.

vh comments on gulam nabi azad
గులాంనబీ ఆజాద్​పై మండిపడ్డ కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​
author img

By

Published : Aug 29, 2020, 8:00 PM IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ అజాద్ వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆర్గనైజేషన్‌ గురించి మాట్లాడే హక్కు గులాంనబీకి లేదని మండిపడ్డారు. ఆనాడు ఆర్గనైజేషన్ ఎన్నికలు అడ్డుకొని తనను పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నది నీవు కాదా అని ఆయనను ఉద్దేశించి ప్రశ్నించారు. గులాం నబీ పదవి ఉంటే ఒక్కమాట.. పదవి లేకపోతే ఇంకోమాట మాట్లాడతారని దుయ్యబట్టారు.

సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉంటే లేఖ ఎలా రాస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ద్వారా ఎంపిక చేయమని ఎందుకు చెప్పలేదన్నారు. నలభై ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందని లేకపోతే ఉండదని తేల్చిచెప్పారు.

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల వాయిదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.