ETV Bharat / state

'మాంసం అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలే' - మాంసం దుకాణాల్లో తనిఖీలు

మాంసం అధిక ధరలకు విక్రయించకుండా పశుసంవర్థక శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. మాంసం అధిక ధరలకు అమ్మితే గట్టి చర్యలు చేపడతామని పశు సంవర్థక శాఖ అధికారుల కమిటీ హెచ్చరించింది.

అధిక ధరలకు అమ్మితే గట్టి చర్యలే
అధిక ధరలకు అమ్మితే గట్టి చర్యలే
author img

By

Published : Apr 26, 2020, 11:34 PM IST

మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశు సంవర్థక శాఖ అధికారుల కమిటీ హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాంసం దుకాణం నిర్వాహకులు కనీసం దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆదేశాల మేరకు మాంసం దుకాణాల తనిఖీ కోసం ఆ శాఖకు చెందిన ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో డాక్టర్ బాబు బెర్రి కన్వీనర్​గా, డాక్టర్లు సింహారావు, ఖాద్రీ, భాస్కర్‌ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.

పలు ప్రాంతాల్లో తనిఖీలు...

కమిటీ సభ్యులు నగరంలోని పలు మాంసం దుకాణాల్లో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టింది. పోలీస్ సిబ్బందితో కలిసి చెంగి చెర్ల స్లాటర్ హౌస్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి, కంటోన్మెంట్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌ తదితర ప్రాంతాల్లోని 20కి పైగా మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్‌ లేని, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సుమారు 8 దుకాణాలను మూసివేయించారు.

ఇవీ చూడండి : ఇంకొంత కాలం లాక్​డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.