రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. మాసబ్ ట్యాంక్ లోని అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ