ETV Bharat / state

హాత్​వే రాజశేఖర్​ కన్నుమూత... ఎమ్​ఎస్​వోల సంతాపం - తెలంగాణ ఎంఎస్​వో అసోసియేషన్

కేబుల్ రంగంలో ఖ్యాతి గాంచిన వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజశేఖర్.. గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం కేబుల్​ రంగానికి లోటుగా ఎమ్​ఎస్​వోలు అభిప్రాయపడ్డారు.

venkatasai-media-private-limited-owner-rajashekhar-died-due-to-heart-attack
హాత్​వే రాజశేఖర్​ కన్నుమూత... ఎమ్​ఎస్​వోల సంతాపం
author img

By

Published : Aug 29, 2020, 1:32 PM IST

హాత్‌వే డిజిటల్ కేబుల్‌ మాజీ డైరెక్టర్‌, వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ‌అధినేత చెలికాని రాజశేఖర్‌ గుండెపోటుతో కన్నుమూశారు.హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.కేబుల్​టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో... రాజశేఖర్‌ సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు.

చెలికాని రాజశేఖర్.. హాత్‌వే రాజశేఖర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో పేరు పొందిన ఆయన...కేబుల్​ రంగంలో తనదైన ముద్ర వేశారు.1968 ఏప్రిల్4న ఏపీలోని విజయనగరం జిల్లా సీతానగరంలో జన్మించారు. తొలిసారి విశాఖపట్నంలో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు.

హైదరాబాద్ ‌కేంద్రంగా ఉన్న హాత్‌వేను నలువైపులా విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో వెంకట సాయి మీడియాను స్థాపించి రెండు రాష్ట్రాల్లో పెద్ద నెట్‌వర్క్‌గా నిలిపారు. కేబుల్​ ఆపరేటర్ల సంక్షేమం కోసం కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్​ఎస్​వోల అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్​ఎస్​వోలసంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఆలిండియా బాల్ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

రాజశేఖర్ ‌మృతిపై బ్రైట్‌వే కమ్యూనికేషన్స్‌ సంతాపం తెలిపింది. తెలంగాణ ఎమ్​ఎస్​వో అసోసియేషన్స్‌, తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. రాజశేఖర్​ కుటుంబానికి ఈటీవీ సీఈవో బాపినీడు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.

venkatasai-media-private-limited-owner-rajashekhar-died-due-to-heart-attack
హాత్​వే రాజశేఖర్​ కన్నుమూత... ఎమ్​ఎస్​వోల సంతాపం

ఇదీచూడండి.. 'దేశంలో లేని క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకొస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.