లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. బేగంబజార్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను సీజ్ చేశారు. చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఆంక్షలు పాటించని వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా