ETV Bharat / state

వరదల ధాటికి వాహనాలు ధ్వంసం.. మరమ్మతులకు భారీగా వ్యయం.. - హైదరాబాద్​లో వాహనాల ధ్వంసం వార్తలు

భాగ్యనగరవాసుల బాధలు ఇంకా తీరిపోలేదు. భారీ వానలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేదెలా అని మథనపడుతున్నారు. కొందరి ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. కొందరి ఇళ్ల ఆనవాళ్లు కూడా మిగల్లేదు. ఈ క్రమంలోనే వాహనాలూ వరదలో పడి కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి. బురద తొలగిస్తున్న కొద్ది వాహనాలు బయట పడుతున్నాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు అన్నీ వరద ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంజిన్‌లో నీరు చేరి కదల్లేని పరిస్థితి నెలకొంది. వేల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అవి సాధారణ స్థితికి వచ్చేలా కనిపించటం లేదు. క్యాబ్‌లు, ఆటోలే జీవనాధారంగా ఉన్న వారికి ఈ వ్యయం భరించటం కష్టసాధ్యమవుతోంది.

వరదల ధాటికి ధ్వంసమైన వాహనాలు.. భారంగా మరమ్మతుల వ్యయం

author img

By

Published : Oct 23, 2020, 1:27 PM IST

వరదల ధాటికి ధ్వంసమైన వాహనాలు.. భారంగా మరమ్మతుల వ్యయం

ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువుల కింద ఉన్న కాలనీలు, బస్తీల్లో ఎక్కువ నష్టం జరిగింది. వరద నీరు ఆరేడు అడుగుల ఎత్తులో రావడం వల్ల భారీ స్థాయిలో బురద, ఇసుక ఎక్కడికక్కడ మేట వేసింది. ఇళ్ల ముందు ఉన్న బైక్‌లు, కార్లు ఇసుక, మట్టిలో కూరుకుపోయాయి. చాలామంది ట్యాక్సీలు, ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. విధులు ముగిసిన తర్వాత వీటిని ఇంటి బయట పార్కింగ్‌ చేస్తుంటారు. ఇలా ఒక్కసారిగా వచ్చిన వరదతో చాలా బైక్‌లు, కార్లు, ఆటోలు ధ్వంసం అయ్యాయి. వరద ఉద్ధృతికి ద్విచక్ర వాహనాలు కొన్ని కొట్టుకుపోయాయి. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చాలా బస్తీల్లో ఎక్కువ ఈ పరిస్థితి కనిపించింది.

మట్టి తవ్విన కొద్ది వాహనాలు..

వరద నీటిలో మునిగిన వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మట్టి తవ్వుతున్న కొద్ది వాహనాలు బయటపడుతున్నాయి. నెంబర్ ప్లేట్‌ ఆధారంగా వాహనాలు గుర్తించి యజమానులకు అప్పగిస్తున్నారు. గగన్‌పహాడ్‌, అలీనగర్‌ తదితర ప్రాంతాల్లో వాహనదారులకు నష్టాలే మిగిలాయి. ముఖ్యంగా కార్లు, ఆటోలు లాంటి వాటిని బురద, మట్టి నుంచి తీయాలంటే జేసీబీ అవసరం అవుతోంది. మట్టిలో పూడుకు పోవడం వల్ల ఇంజన్‌, సీట్లు, ఏసీలు, లైట్లు, స్టీరింగ్‌, టైర్లు అన్ని దెబ్బతింటున్నా. చాలామంది బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌లో అప్పులు తీసుకొని వాహనాలు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. కార్లు, ఆటోలు పూర్తిగా ధ్వంసం కావడం వల్ల తమ ఉపాధికి గండి పడిందని ఆందోళన చెందుతున్నారు. బీమా లేని వాహనాలైతే భారీగా నష్టపోయేనట్టేనని నిపుణులు కూడా చెబుతున్నారు. వరదలో మునిగి కార్లలోని ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ మాడ్యులర్‌-ఈసీఎం, పవర్‌స్టీరింగ్‌, ఇంజన్‌, బేరింగ్‌లు పూర్తిగా పాడైపోయాయి.

రిపేర్​ షాపులకు తరలిన వాహనదారులు..

దెబ్బతిన్న వాహనాలతో మరమ్మతుల షెడ్డుల వద్ద వాహనదారులు వరుస కడుతున్నారు. ఇంజిన్‌లోకి నీరు, బురద చేరటం వల్ల బండ్లు కదలనంటూ మొరాయిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యం మించి వాహనాలు వస్తున్నట్లు మెకానిక్‌లు చెబుతున్నారు. ఖర్చు కూడా బాగానే అవుతోంది. ఒక వేళ భరించేందుకు ముందుకొస్తున్నా.. అంతా బాగై వాహనం ఇంటికి రావాలంటే చాలా రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా కార్ల మరమ్మతులకు నిరీక్షణ తప్పటం లేదు. కొందరు మెకానిక్‌లకు కనీసం 30-60 రోజుల పాటు వేచి చూడాలని చెబుతున్నారు. మరికొందరు కారు చూసిన తరవాత కానీ ఏమీ చెప్పలేమంటున్నారు.

3 రకాలుగా విభజించి మరమ్మతులు..

ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రికల్స్‌ లాంటివి ఎంత మేరకు పాడయ్యాయో తనిఖీకే ఎక్కువ సమయం పడుతోంది. నీటిలో పూర్తిగా మునిగిపోవటం వల్ల కారు వ్యయంలో 20-40% మరమ్మతులకు ఖర్చవుతుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ధ్వంసమైన కార్లను 3 రకాలుగా విభజించి మరమ్మతు చేస్తున్నారు. కార్పెట్‌ లెవల్‌ వరకూ కారు మునిగి ఉంటే కార్పెట్‌ మార్పు తప్పనిసరి చేస్తున్నారు. గ్రీజింగ్‌, ఎలక్ట్రికల్‌ డ్యామేజీ తదితర కారణాలు చూపుతూ 15 రోజుల సమయం అడుగుతున్నారు. సీట్‌ లెవల్‌ వరకూ నీరు వస్తే లెదర్‌ ఛేంజ్‌, ఇంజిన్‌ చెక్‌, ఎలక్ట్రికల్స్‌ చెక్‌ అంటూ 20 రోజుల వ్యవధి అడుగుతున్నారు. డాష్‌బోర్డ్‌ వరకూ కారు నీటిలో మునిగి ఉంటే నెల నుంచి నెలన్నర, కారు పూర్తిగా మునగడం, బాడీకి డ్యామేజీ అయితే రెండు నుంచి మూడు నెలల సమయం అడుగుతున్నారు.

లక్షల్లో ఖర్చు..

ఇంజిన్‌ నీటిలో మునిగినప్పుడు ఎయిర్‌ ఫిల్టర్‌ ద్వారా టర్బో ఎగ్జాస్ట్‌లోకి చేరి పిస్టిన్‌ బిగుసుకుపోతుంది. ఈ కారణంగా వైరింగ్‌లో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు ఇంజిన్‌ పూర్తిగా తీసి రిపేర్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మరమ్మతు చేయాలంటే 15-20 రోజులు పడుతుంది. ఇంజిన్‌ సమస్య లేకుండా ఉంటే 30-50 వేల రూపాయల వరకు ఖర్చు రావచ్చు. అదే ఇంజిన్‌లో ప్రధాన సమస్య తలెత్తితే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ద్విచక్రవాహనాలదీ ఇదే పరిస్థితి. చిన్న చిన్న సమస్యలైతే వెయ్యి, రెండు వేల రూపాయలతో బాగవుతున్నా...ఇంజిన్‌ పాడైతే మాత్రం అంతకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. Spot

4 వేల వాహనాలు ధ్వంసం..!

ఈ వరదల కారణంగా కనీసం 4 వేల వాహనాలు ధ్వంసమైనట్టు అంచనా. ముఖ్యంగా పాతబస్తీలోని హఫీజ్ బాబా నగర్, అల్‌జుబైల్ కాలనీ, నబీల్ కాలనీ, ఫలక్‌నుమా, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో వాహనాలు పాడయ్యాయి. కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు బాగు చేయటానికి వీలు లేనంతగా ధ్వంసమయ్యాయి. సాధారణ మోడల్‌ కార్లు పాడైతే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. సెడాన్లు, హైఎండ్ కార్ల మరమ్మతుకు కనీసం లక్ష వరకు వ్యయ భారం తప్పదని మెకానిక్‌లు చెబుతున్నారు. వరద నీటిలో మునిగిన ద్విచక్రవాహనాల మరమ్మతు ఖర్చు కనీసం 2 వేల 500 రూపాయలుగా ఉంటోంది.

చెన్నై, ముంబయి తర్వాత హైదరాబాద్​కు..

కొన్నేళ్ల క్రితం చెన్నై, తర్వాత ముంబయి.. ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో కార్లకు నీటి గండం పట్టుకొంది. ఇప్పటికే హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో కార్లున్నాయి. వాటికి తోడు లాక్‌డౌన్‌ ఎత్తేశాక భౌతికదూరం కోసం హైదరాబాద్‌ నగర వాసులు భారీ ఎత్తున కొత్త, సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొన్నారు. వందేళ్ల అత్యధిక వర్షపాతం కొద్ది గంటల్లోనే నమోదు కావడం వల్ల రోడ్లు, నాలాలు ఏకమై కార్లు పడవలై తేలిపోయాయి. అప్పు చేసి కార్లు కొనుక్కున్న వారు ఇప్పుడు నిర్వేదంలో మునిగిపోయారు. కారు పాడయిందన్న బాధ కన్నా...మరమ్మతుకు ఒకటి రెండు నెలలు ఆగాల్సి వస్తుందన్న ఆందోళన వారిని కలవరపెడుతోంది. ముంబయిలో ఇవే పరిస్థితులు తలెత్తినప్పుడు భారీ స్థాయి ప్రకటనలిచ్చి ఆఫర్లు అందించిన సంస్థలేవీ హైదరాబాద్‌ వాసులను ఆదుకోవడానికి ముందుకు రాలేదు.

ఈఎంఐల వ్యయం భరించలేకపోతున్నారు..

రవాణాశాఖ అంచనాల మేరకు నగరంలో సుమారు 55 లక్షల వాహనాలు ఉన్నాయి. 3 నెలల్లోనే 60 వేల ద్విచక్ర వాహనాలు, మరో 25 వేలకు పైగా కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటికీ మెట్రో సర్వీసులు మినహా సిటీ బస్సులు పరిమితంగానే ఉండడం వల్ల ఎక్కువమంది వ్యక్తిగత వాహనాల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగానే.. ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లింది. వాహన మరమ్మతులు పెరగటం వల్ల నగరంలో విడిభాగాల కొరత ఏర్పడింది. ఈ కారణంగా.. బాగు చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. కరోనా సంక్షోభంతోనే ఆర్థికంగా చతికిలపడిన వారికి రిపేరింగ్ ఖర్చులు అదనపు భారంగా మారాయి. ముఖ్యంగా ఈఎంఐల పద్ధతిలో వాహనాలు కొనుగోలు చేసిన వారు ఈ వ్యయం భరించలేకపోతున్నారు.

ఇదీ చదవండి: 'నష్టం భారీగానే జరిగింది.. త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.